హన్మకొండ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు ఉంచినట్టు వచ్చిన ఫోన్ కాల్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. డయల్ 100కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్టు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

తక్షణమే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌తో కలసి పోలీసులు కోర్టు పరిసరాలను నిశితంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో అనుమానాస్పదంగా కనిపించిన 6 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.బాంబు బెదిరింపు ఫోన్ చేసినవారిని గుర్తించే దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. భద్రతా దృష్ట్యా కోర్టు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.

Read More : బ్యాంకాక్-హైదరాబాద్ విమానానికి సాంకేతిక అంతరాయం…

One thought on “హన్మకొండ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

Comments are closed.