జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసిన ఘటనపై పోలీసులు కఠినంగా స్పందించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియా వేదికలపై అవమానకరంగా ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పిఠాపురం పోలీసులు కోనసీమ జిల్లాకు చెందిన సాయి వర్మ, మచిలీపట్నం పట్టణానికి చెందిన రామాంజనేయులు, హైదరాబాద్‌కు చెందిన షేక్ మహబూబ్‌లను అరెస్టు చేశారు. నిందితులు క్షుద్ర ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పవన్ కళ్యాణ్ చిత్రాన్ని అవమానకరంగా మార్ఫింగ్ చేసి, బహిరంగ వేదికలపై వైరల్ చేయడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనిపై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు.
ప్రస్తుతం ముగ్గురు నిందితులపై ఐటి చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత ధిక్కార పోస్టులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Read More : గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సీఎం కీలక వ్యాఖ్యలు

One thought on “పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ ఘటనపై ముగ్గురి అరెస్ట్.”
Comments are closed.