ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే సహించబోమని, తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, ఎమ్మెల్యేలపై ఇన్‌చార్జ్ మంత్రులు కఠినంగా నిఘా పెట్టాలని సూచించారు. కేబినెట్‌కు ముందు సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్‌తో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో కూడా ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై దాడులకు దిగడం అసహ్యం అనిపిస్తోందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని ఆయన తెలిపారు.
ప్రజల్లోకి స్త్రీ శక్తి వంటి సంక్షేమ పథకాలు బాగా వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యేల అడ్డగోలుగా ప్రవర్తన పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారిని అదుపులో పెట్టే బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులదేనని స్పష్టంచేశారు. అలాగే పెరోల్ సిఫార్సుల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని హోంమంత్రి వంగలపూడి అనితకు సీఎం ప్రత్యేక సూచనలు ఇచ్చారు.
ఈ నెల 23వ తేదీన సీఎం నివాసంలో మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారని, ఆ సమావేశంలో జిల్లా పార్టీ కమిటీలు, ఇతర నియామకాలపై చర్చ జరుగుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
Read More : కృష్ణా జిల్లాలో భార్యతోడు ప్రియుడు భర్త హత్య

One thought on “ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరిక ?”
Comments are closed.