“పవన్ కళ్యాణ్ తాజా చర్యలపై సీపీఐ రామకృష్ణ ప్రశ్నలు”

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి పూర్తిగా మారిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాషాయ దుస్తులు ధరిస్తూ, బొట్టు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) యొక్క ఏజెండాను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ తనను సనాతన హిందువుగా చాటించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆయన క్రైస్తవ మతానికి చెందిన తన భార్య అన్నా లెజినోవాను తిరుమలలో తలనీలాలు సమర్పింపజేసారని రామకృష్ణ ఆరోపించారు. “మతం మార్చకుండా భక్తిని చూపించడంలో ఎంతవరకు నాటకం చేయాల్సి ఉంటుంది అనేది ప్రజలే నిర్ణయించాలి,” CPI రామకృష్ణ అన్నారు.

Read More : తిరుమలలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తలనీలాలు సమర్పణ — ట్రోల్స్‌పై విజయశాంతి కౌంటర్

One thought on ““పవన్ కళ్యాణ్ తాజా చర్యలపై సీపీఐ రామకృష్ణ ప్రశ్నలు”

Comments are closed.