విశాఖ ఐటీ హబ్‌లో టీసీఎస్ భారీ పెట్టుబడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం ఐటీ రంగ అభివృద్ధికి మరో గొప్ప ముందడుగు పడింది. విశాఖపట్నంలోని ఐటీ హిల్-3లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈ క్రమంలో టీసీఎస్ సంస్థకు మొత్తం 21.66 ఎకరాల భూమిని కేటాయిస్తూ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అత్యంత లాభదాయకమైన ఈ ఒప్పందం ప్రకారం, 99 సంవత్సరాల పాటు టీసీఎస్‌కు లీజుపై భూమిని అప్పగించనున్న రాష్ట్ర ప్రభుత్వం, సంవత్సరానికి కేవలం 99 పైసల చొప్పున లీజు రుసుముగా నిర్ణయించింది.

ఈ ప్రాజెక్ట్‌కు టీసీఎస్ సంస్థ రూ.1,370 కోట్ల మేర భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అమలయ్యే దశలోకి వెళ్లిన తర్వాత, విశాఖపట్నం ప్రాంతానికి సుమారు 12,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇది విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందడానికి, యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించడానికి దోహదం చేస్తుందన్న నమ్మకంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Read More : ఏపీ సీఎం చంద్రబాబు యూరప్ పర్యటనకు సిద్ధం