పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించి, తమ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి వెంటనే వెనక్కి పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ అంశంపై అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహించి, ఆపై ముఖ్యమంత్రులతో ఫోన్‌లో చర్చలు జరిపారు. పాకిస్థాన్‌కు చెందినవారి వీసాలు ఈ నెల 27లోగా రద్దు చేయాలని సూచించినట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లో ఉన్న పాక్ పౌరుల వివరాలు సేకరించి, వీసా రద్దు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
పహల్గాంలోని దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఇది అనివార్య చర్యగా కేంద్రం భావిస్తోంది.
Read More : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల, భద్రతా దళాల మధ్య ఎన్ కౌంటర్
