భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం, పాకిస్థాన్ రేంజర్లు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పదిమంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. సైనిక వర్గాలు ఈ సమాచారం వెల్లడించాయి.
పహల్గామ్‌లోని పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిన విషయం వెలుగులోకి వచ్చాక, భారత భద్రతా దళాలు “ఆపరేషన్ సిందూర్” పేరిట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అనంతరం, సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి.
భారత ఆర్మీ ప్రకటించిన ప్రకారం, పాకిస్థాన్ రేంజర్లు భారత భూభాగంలోని పౌర ప్రాంతాలను గుర్తింపు లేకుండా లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఆయన పారామిలిటరీ బలగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
Read More : ఆపరేషన్ సిందూర్‌పై మహిళా అధికారుల వ్యాఖ్యలు:

One thought on “Amit shah : పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల్లో 10 మంది భారతీయ పౌరులు మరణం”
Comments are closed.