video : పాక్‌లోని గుల్పూర్ ఉగ్ర శిబిరంపై భారత సైన్యం దాడి..

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాల ఘాటైన స్పందన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాక్‌ అధీనంలోని గుల్పూర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరంపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను భారత సైన్యం (ADGPI) తాజాగా విడుదల చేసింది. ఇది పాక్‌లోని రెండవ కీలక ఉగ్ర కేంద్రంగా గుర్తించబడింది.

ఈ గుల్పూర్‌ శిబిరాన్ని లష్కరే తోయిబా (LeT) ప్రధాన కేంద్రంగా ఉపయోగిస్తూ, జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ ప్రోత్సహించేందుకు Pakistan ఉపయోగిస్తోందని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. గుల్పూర్‌తో పాటు కోట్లి ప్రాంతంలోనూ ఉగ్ర శిబిరాలపై టార్గెట్‌డ్ దాడులు చేపట్టిన భారత సైన్యం, ఈ స్థావరాలను నాశనం చేసింది.

ఈ దాడులు దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న శత్రు శిబిరాలను అణిచివేసేందుకు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల్లో భాగమని అధికారులు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇది ఒక కీలక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. భారత్ తన ప్రజల భద్రత కోసం అవసరమైన ప్రతీ చర్య తీసుకుంటుందని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయి.

Read More : Rajnath Singh : భారత సైన్యం శత్రువులకు గుణపాఠం చెప్పింది

2 thoughts on “video : పాక్‌లోని గుల్పూర్ ఉగ్ర శిబిరంపై భారత సైన్యం దాడి..

Comments are closed.