ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో ఈ నెల 12న చోటుచేసుకున్న ఇద్దరు చిన్నారుల హత్య కేసులో సంచలనమైన మలుపు తిరిగింది. ఆ ఘటనలో తండ్రి రవిశంకర్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి మాయ చేశాడు. అయితే, ఆయన ఇంకా బతికే ఉన్నాడన్న అనుమానంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి చివరకు విశాఖపట్నంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తొలుత తాళం వేసిన గదిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించగా, పక్కన రవిశంకర్ రాసిన సూసైడ్ లేఖ కనిపించింది. తన భార్యపై అనుమానం వచ్చిందని, అందుకే పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ లేఖలో రాశాడు. దీంతో పోలీసులు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.
అయితే ఎంత వెతికినా రవిశంకర్ మృతదేహం లభించకపోవడంతో, అతను బతికే ఉన్నాడన్న కోణంలో దర్యాప్తును మళ్లించారు. బ్యాంకు లావాదేవీలు, ఫోన్ లొకేషన్, కొత్తగా తీసుకున్న సిమ్ కార్డు ఆధారంగా ఆచూకీ గుర్తించి, విశాఖలో అతన్ని పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో రవిశంకర్ తన భార్యపై అనుమానం ఉన్నందునే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం కేసును మరింత లోతుగా విచారిస్తున్న పోలీసులు, రవిశంకర్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దారుణ ఘటన గ్రామస్థుల మధ్య తీవ్ర ఆవేదనకు దారితీసింది.
Read More : విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవం

2 thoughts on “ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలను చంపి పారిపోయిన తండ్రి విశాఖలో అరెస్టు”
Comments are closed.