ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొంతమంది పోలీసుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన పోలీసులే, అధికార బాహుబలంతో ప్రజలను వేధిస్తున్నారనే ఆరోపణలు నానుతున్నాయి.
తాజాగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రొద్దుటూరులో సీఐ రామకృష్ణ వేధింపులకు గురైన తల్లీ కొడుకులు – లక్ష్మీ, మహిధర్ రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించారు. సీఐ తమపై అన్యాయంగా దాడి చేశాడని, వేధింపులు చేస్తున్నాడని ఆరోపించిన వారు, తట్టుకోలేక చావుదిశగా వెళ్లారని స్థానికులు వెల్లడించారు.
అధికార దుర్వినియోగంతో పోలీసులు సామాన్యులను వేధిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇటువంటి ఘటనలు మరిన్ని వెలుగులోకి వస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది.
ఇప్పటికే అనంతపురంలో మరో పోలీసు నిర్లక్ష్యం కారణంగా ఓ యువతి మృతి చెందిన ఘటనలో సంబంధిత అధికారిని సస్పెండ్ చేశారు. అయినప్పటికీ, పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణపై తిరిగి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ తరహా ఘటనలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జనాల్లో పెరుగుతోంది.
Read More : ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలను చంపి పారిపోయిన తండ్రి విశాఖలో అరెస్టు

One thought on “ఏపీలో పోలీసుల వేధింపులపై పెరుగుతున్న ఆరోపణలు”
Comments are closed.