యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో సోలోగా వచ్చిన బెస్ట్ టాప్ మూవీగా నిలిచిన ఈ చిత్రం, భారీ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లోనూ అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.
ఇప్పటికే జపాన్‌లో విడుదలైన ‘దేవర’ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల మూవీ టీమ్ జపాన్‌లో స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. జపనీస్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహించడంతో అక్కడ ‘దేవర’ హైప్ మరో మెట్టుపైకి వెళ్లింది.
ఈ ప్రీమియర్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ స్వయంగా హాజరై అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ప్రత్యేక ఆకర్షణగా, జపాన్ ఫ్యాన్స్‌తో కలిసి ‘ఆయుధ పూజ’ పాటకు స్టెప్పులు వేయడంతో థియేటర్ మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. ప్రేక్షకులు ఆనందంతో వీడియోలు తీస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ఫెస్టివల్ మూడ్‌లో ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్ ఎనర్జీ, స్టైల్ అక్కడి జపనీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’లో భీమ్ పాత్ర ద్వారా ఎన్టీఆర్‌కి జపాన్‌లో పెద్దఎత్తున ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ‘దేవర’ సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరగనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా అలరించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.
మొత్తం మీద, జపాన్ ప్రీమియర్ ఈవెంట్ ‘దేవర’ సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్లో మరింత హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక త్వరలోనే ‘దేవర 2’ షూటింగ్ ప్రారంభం కానుండగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్‌లో చేరనున్నాడు.
Japan lo claps kuda discipline tho sync lo kodthunnaru🫡😭!#DevaraInJapan pic.twitter.com/QFpaoNz8DL
— 匠 (@Socraplatapus) March 24, 2025

One thought on “జపాన్‌లో ‘దేవర’ జోరు.. ఎన్టీఆర్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా!”
Comments are closed.