తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌లో రూపొందిన హిందీ సినిమా ‘జాట్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పూర్ ఓపెనింగ్‌ను నమోదు చేయడంతో, నిర్మాతలు సేఫ్ కానేనా అనే చర్చలు మొదలయ్యాయి.
‘గదర్ 2’ విజయంతో సన్నీ డియోల్ మార్కెట్ పెరిగిన నేపథ్యంలో, ‘జాట్’ కోసం ఆయనకు రూ.50 కోట్ల పారితోషికం చెల్లించారు. ఇది అతడి కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం కావడం విశేషం. సినిమా మొత్తం బడ్జెట్‌లో సగం పైసలు హీరో రెమ్యునరేషన్‌కే ఖర్చవ్వడంతో, ఇది రిస్క్ అనే మాట వినిపిస్తోంది. కానీ అతడి గత హిట్‌కి ఇది ఓ న్యాయమైన నిర్ణయంగా మేకర్స్ భావించారట.
సినిమా విడుదలకు ముందే థియేట్రికల్, ఇతర హక్కుల ద్వారా దాదాపు రూ.85 కోట్లు రికవరీ అయ్యాయని సమాచారం. కానీ మొదటి రోజు కలెక్షన్లు కేవలం రూ.10 కోట్లు వచ్చాయని అంచనా. ఇది వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్న సినిమా తరహాకి సరిపోడు. వీకెండ్ కలెక్షన్లు పుంజుకుంటేనే నిర్మాతలకు లాభాలు సాధ్యమవుతాయ్, లేదంటే సమస్యలు తలెత్తే అవకాశముంది.
తెలుగులో ‘వీర సింహారెడ్డి’ వంటి మాస్ ఎంటర్టైనర్ తీసిన గోపీచంద్ మలినేని, మొదట ఈ కథను రవితేజతో తెలుగులో తీయాలని భావించగా, బడ్జెట్ ఇష్యూస్ కారణంగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యారు. హిందీలో కూడా తక్కువ బడ్జెట్‌తో తయారై ఉంటే లాభాలే ఉండేవి. కానీ భారీ ఖర్చులు చేయడంతో నిర్మాతలకు ఇప్పుడు కలెక్షన్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

One thought on “జాట్ సినిమా రిస్కీ బిజినెస్: మైత్రి – పీపుల్స్ మోసపోయారా?”
Comments are closed.