వెస్టిండీస్ ఛాంపియన్స్‌పై ఘనవిజయం సాధించిన ఇండియా ఛాంపియన్స్ వరల్డ్ ఛాంపియన్స్ లెజెండ్ (డబ్ల్యూసీఎల్) టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్ బర్త్ కోసం 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా, టీమిండియా కేవలం 13.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 144 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో స్టువర్ట్ బిన్నీ (50 నాటౌట్), శిఖర్ ధావన్ (25), యువరాజ్ సింగ్ (21 నాటౌట్), యూసుఫ్ పఠాన్ (21) ఆకట్టుకునే ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. లీగ్‌లో ఒకే మ్యాచ్ గెలిచినా, మెరుగైన రన్‌రేట్‌తో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
రేపు పాక్‌తో సెమీస్ పోరు?
సెమీఫైనల్లో భారత్ రేపు పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సాయంత్రం 5 గంటలకు (భారత కాలమానం) ప్రారంభం కానుంది. లీగ్ దశలో భారత్ బాయ్‌కాట్ చేయడంతో పాక్‌తో మ్యాచ్‌ను టోర్నీ మేనేజ్మెంట్ రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సెమీఫైనల్లో కూడా ఇండియా ఛాంపియన్స్ బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. దీంతో రేపు భారత్ మైదానంలోకి దిగుతుందా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
Read More : జట్టు కూర్పులో కీలక మార్పులు చేయనున్న టీమ్ ఇండియా ?

One thought on “సెమీస్‌లోకి ఇండియా ఛాంపియన్స్ – రేపు పాక్‌తో పోరు.”
Comments are closed.