చరిత్ర అనేది సముద్రం లాంటిదని, దాన్ని సరిగ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) అన్నారు. విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateshwar Rao) రచించిన తెలుగు, ఇంగ్లీష్ వెర్షన్ల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన ఆమె, ఈ గ్రంథం సమగ్రంగా చరిత్రను వివరించిందని ప్రశంసించారు.
చరిత్రను నిజంగా చెప్పే ధైర్యం అవసరం
చరిత్రను వక్రీకరించకుండా జరిగినదాన్ని జరిగినట్టుగా చెప్పడం అవసరమని ఆమె స్పష్టం చేశారు. గతంలో చరిత్ర రచనలో దేశానికి న్యాయం జరగలేదని, ఆధిపత్యశక్తులు తమకు అనుకూలంగా చరిత్రను మలచుకున్నారని విమర్శించారు. “ఒక దేశ చరిత్రను వక్రీకరించే విధానం పాశ్చాత్య దేశాల్లోనూ కనిపించింది. అమెరికాలో ఓకిజం (Wokeism) అనేది ఒకదానిగా మారింది. ట్రంప్ వచ్చిన తర్వాత అది లేదంటే, దానికి అర్థం ఏమిటి?” అని ప్రశ్నించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందన
ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రను లోతుగా అధ్యయనం చేసి ముఖ్యాంశాలను మాత్రమే 340 పేజీల పుస్తకంగా రూపొందించినట్లు తెలిపారు. తాను ఇప్పటి వరకు నలుగురు రచనలు చేసినట్లు వెల్లడించిన ఆయన, ఈ పుస్తకం తన ఐదో రచన అని పేర్కొన్నారు.
