యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“బిగ్ బ్రేకింగ్ న్యూస్… యెమెన్ జైలులో ఉన్న భారతీయ నర్సు నిమిష ప్రియ విడుదలకు సిద్ధంగా ఉంది,” అంటూ కేఏ పాల్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. తాను ఆమె విడుదల కోసం కృషి చేస్తున్నానని, త్వరలో ఆమె జైలు నుంచి బయటకు వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు నిమిష ప్రియ విడుదలపై యెమెన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సమగ్రంగా పరిశీలిస్తూ ఆమెను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల నిమిష ప్రియ కుటుంబ సభ్యులు కూడా ఆమె విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు.ప్రస్తుతం ఈ కేసు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
Read More : ఉత్తరాఖండ్‌లో వరదలు ఉధృతం – చార్‌ధామ్ యాత్రికులు చిక్కున
