భర్తను హత్య చేసిన భార్య, మామ అరెస్ట్

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో ఇతరులతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో భార్య, మామ కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. 33 ఏళ్ల రెడ్డిపల్లి వెంకటేష్‌కి 11 ఏళ్ల క్రితం జయశ్రీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, జయశ్రీ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ పెద్దల సహాయంతో ఆమె రెండు నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చింది.

బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేష్ ఇంటికి చేరగా, జయశ్రీ ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆమెతో ఎవరిలో మాట్లాడుతున్నావని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జయశ్రీ వెంకటేష్‌ను పట్టుకోగా, ఆమె తండ్రి పండరి అతని గొంతు నులిమి హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలించి పడేయాలనే యత్నం చేశారు. కానీ వెంకటేష్ తల్లి, సోదరులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జయశ్రీ, ఆమె తండ్రిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Read More : తెలంగాణ రైజింగ్ – 2047పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

One thought on “భర్తను హత్య చేసిన భార్య, మామ అరెస్ట్

Comments are closed.