లోకేష్ ఘాటు వ్యాఖ్యలు – జగన్ పాలనపై విమర్శలు, బకాయిల చెల్లింపులపై స్పష్టత

nara lokesh ys jagan

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా స్థంభించిపోయిందని, విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, ముఖ్యంగా విద్యా రంగం తీవ్రంగా ప్రభావితమైందని విమర్శించారు.

“ప్రభుత్వం శాశ్వతం, రాజకీయాలు మాత్రమే తాత్కాలికం” అని నారా లోకేష్ హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులన్నింటినీ నిలిపివేసిందని, అప్పటి ప్రభుత్వ తీరే ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి కారణమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అయితే ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

“మేము బాధ్యత గల ప్రభుత్వం.. మీరు వదిలేసిన బకాయిలను కూడా చెల్లిస్తున్నాం” అని లోకేష్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రూ. 788 కోట్లు విడుదల చేసిన తమ ప్రభుత్వం తాజాగా మరో రూ. 600 కోట్లు విడుదల చేసిందని, త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన విధంగా తాము ప్రవర్తించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

Read More

One thought on “లోకేష్ ఘాటు వ్యాఖ్యలు – జగన్ పాలనపై విమర్శలు, బకాయిల చెల్లింపులపై స్పష్టత

Comments are closed.