నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల ఆస్తులపై ఈడీ చెక్.

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యచరణను ముమ్మరం చేసింది. కేసు దర్యాప్తులో కీలకంగా ముందస్తు చర్యగా దేశంలోని ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఇటీవల నోటీసులు జారీ చేసింది.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ (AJL)కు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ పేరున కేవలం రూ.50 లక్షల కింద స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్ గాంధీలకు తలసరి 38 శాతం వాటాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 8, రూల్ 5(1) కింద రూ.661 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు శనివారం అధికారిక నోటీసులు జారీ చేసింది.

ఈడీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఢిల్లీలోని ఐటీఓలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబై బాంద్రాలోని ఆస్తి, లక్నోలో బిశేశ్వర్ నాథ్ రోడ్‌లో ఉన్న ఏజేఎల్ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టంగా ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన ఈడీ, ఆస్తుల స్వాధీనం ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధినేతలపై ఈడీ చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read More : యుపీఐ వాడే వారికి కీలక సమాచారం — అంతర్జాతీయ లావాదేవీలపై ఎన్‌పీసీఐ నిషేధం!