యుపీఐ వాడే వారికి కీలక సమాచారం — అంతర్జాతీయ లావాదేవీలపై ఎన్‌పీసీఐ నిషేధం!

దేశవిదేశాల్లో డిజిటల్ చెల్లింపులకు యుపీఐ సేవలను వినియోగిస్తున్న వినియోగదారులకు షాక్ ఇచ్చేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. యుపీఐ ఆధారిత అంతర్జాతీయ క్యూఆర్ కోడ్‌ల ద్వారా జరిపే పేమెంట్లు మరియు మనీ ట్రాన్స్‌ఫర్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ మార్గంలో QR కోడ్‌లను స్కాన్ చేసి ఏదైనా అంతర్జాతీయ చెల్లింపులు చేయడం ఇకపై సాధ్యపడదని స్పష్టంచేసింది. దీనివల్ల విదేశాల్లో ఉన్నవారు లేదా విదేశీ వ్యాపార సంస్థలకు QR స్కాన్ ద్వారా డబ్బులు పంపాలనుకునేవారు ఇకపై ఈ సదుపాయాన్ని ఉపయోగించలేరు.

ఈ నిర్ణయం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందన్న వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. అంతర్జాతీయ లావాదేవీలకు యుపీఐ ఉపయోగించే వినియోగదారులు ముందుగా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More : మోడల్ ఫొటోతో తెలుగు ఎన్ఆర్ఐకి బురిడీ కొట్టించి రూ.2.68 కోట్లు కొట్టేసిన అన్నాచెల్లెళ్లు

One thought on “యుపీఐ వాడే వారికి కీలక సమాచారం — అంతర్జాతీయ లావాదేవీలపై ఎన్‌పీసీఐ నిషేధం!

Comments are closed.