పహల్గాం ఉగ్రదాడి వీరుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబానికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం న్యాయం చేసింది. అనంత్‌నాగ్ జిల్లా హపత్నార్ ప్రాంతంలోని హుస్సేన్ షా ఇంటికి స్వయంగా వెళ్లిన జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆయన భార్య గుల్నాజ్ అక్తర్‌కు నియామక పత్రాన్ని అందించారు.

గుల్నాజ్ అక్తర్‌కు అనంతనాగ్‌లోని మత్స్య శాఖలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆదిల్ హుస్సేన్ షా ప్రదర్శించిన ధైర్యం, సేవలకు గుర్తుగా ప్రభుత్వ తరపున ఈ ఉద్యోగాన్ని అందించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.

ఉగ్రదాడిలో తన జీవితాన్ని అర్పించిన ఆదిల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదరించడంపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న ప్రతి కుటుంబానికి ఇదే విధంగా సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.

Read More : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నాయుడు కీలక ప్రకటన

2 thoughts on “పహల్గాం ఉగ్రదాడి వీరుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

Comments are closed.