సినిమాల్లో ఎన్నో పాత్రలతో అభిమానులను మెప్పించిన జగపతీ బాబు ఇటీవల ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సినిమాల్లో హీరోల తండ్రిగా, కీలక పాత్రల్లో మెప్పించి అభిమానులను గెలుచుకున్న జగపతీ బాబు, ఇప్పుడు సామాన్య వ్యక్తిగా వీధుల్లో తిరుగుతూ సాదాసీదా ఇమేజ్‌ను కనబరచారు. అయన ఇటీవల ఒక వీడియో ద్వారా తనకు ఎదురైన అనుకోని అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.
జగపతీ బాబు ఈ వీడియోలో ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా, సింపుల్‌గా సిమెంట్ రంగు షర్టు, కాకీ రంగు ప్యాంట్ వేసుకుని ప్రజల మధ్య స్నేహితులతో కలిసి ఓ మొబైల్ షాప్‌కి వెళ్లారు. ఈ సమయంలో అతనితో ఉన్న సిబ్బంది ఆయనను వీడియో తీస్తూ వెంబడించారు. కానీ, ఆశ్చర్యకరంగా, వారి నుండి ఒక్కరు కూడా ఆయనను గుర్తుపట్టలేకపోయారు.
అటు సినిమాల్లో, అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్న జగపతీ బాబును ఈ పరిస్థితిలో ప్రజలు గుర్తు పట్టలేకపోవడం విశేషం. ప్రజలు కొంతకాలం పాటు ఆయనను పక్కనుండి చూస్తూ కూడా ఎవరో అన్నట్టు స్పందించారు. కానీ, స్వయంగా జగపతీ బాబు ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అభిమానులు ఆశ్చర్యంతో స్పందించారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఎలా ఇలా సాధారణంగా ఉంటారు సార్” అనే కామెంట్స్‌తో జగపతీ బాబుకు సంబంధించిన ఈ వీడియో అభిమానుల మధ్య ఒక హాట్ టాపిక్‌గా మారింది.
Naa payanam black & white loki ani miku telichestuna.. pic.twitter.com/U5M8PF8CVZ
— Jaggu Bhai (@IamJagguBhai) April 11, 2025

One thought on “జగపతిబాబుకు వింత అనుభవం: ప్రజలు గుర్తుపట్టలేదు!”
Comments are closed.