తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ పార్టీల డ్రామా — KTR కౌంటర్ కామెంట్స్

రాష్ట్రంలో ఉన్న రెండు ఢిల్లీ పార్టీలు మధ్య ఉన్న విభేదాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, “ఒక పార్టీ ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, మరొకటి ఢిల్లీ వాళ్ల చెప్పులు మోసే పార్టీ” అని చెప్పారు. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, HCU కంచ గచ్చిబౌలి 400 ఎకరాల అటవీ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కాంగ్రెస్ మంత్రి మరోదిక్కున వేరు వేరు మాటలు చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ, “ముందు మీరు మీరు కూర్చుని మాట్లాడుకొని స్పష్టంగా బయటకి రండి ” అని వారిని కోరారు.

Read More : ఐసీఐసీఐ బ్యాంకు రుణం అంశంపై కేటీఆర్ వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందన

One thought on “తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ పార్టీల డ్రామా — KTR కౌంటర్ కామెంట్స్

Comments are closed.