నాసిక్‌లో తాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహిళ..

మహారాష్ట్రలో తీవ్ర వేడి కారణంగా భూగర్భ జల మట్టాలు క్రమంగా తగ్గిపోతుండటంతో గ్రామాలు తాగునీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాసిక్ జిల్లా నుంచి ఓ హృదయవిదారక వీడియో వైరల్‌గా మారింది.

వీడియోలో ఓ మహిళ తాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి బావిలోకి దిగుతూ కనిపించింది. తాడు సాయంతో ఆమె బావిలోకి దిగి నీరు తీసుకొస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది.

తీవ్రమైన నీటి కొరతతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటాన్ని ఈ వీడియో మరోసారి హైలైట్ చేసింది. మహారాష్ట్రలోని అనేక గ్రామాలు ఇప్పటికీ తాగునీటి కోసం పోరాటం చేస్తున్నారు.

Read More : జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్: ఎనిమిది మావోయిస్టులు హతం

One thought on “నాసిక్‌లో తాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహిళ..

Comments are closed.