కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య..

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతిలపై పోలీసులు కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి హత్య వెనుక తల్లి, సోదరి పాత్ర ఉండవచ్చన్న అనుమానాన్ని కార్తికేష్ తన ఫిర్యాదులో వ్యక్తం చేశారు. తల్లి, సోదరి గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని, తరచూ తండ్రితో గొడవలు జరిగేవని తెలిపారు.

హత్య జరిగిన సమయంలో ఇంట్లో కత్తులు, పగిలిన సీసా లభించినట్లు కార్తికేష్ పోలీసులకు వివరించారు. ఆదివారం సాయంత్రం పల్లవిని, సోమవారం కృతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సౌత్ ఈస్ట్ డీసీపీ సారా ఫాతిమా నేతృత్వంలో దర్యాప్తును వేగవంతం చేశారు.

Read More : నాసిక్‌లో తాగునీటి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహిళ..

One thought on “కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య..

Comments are closed.