అమెరికా వీధుల్లో టెస్లా కారులో సోఫీ ట్రిప్

Sophie Choudry self-driving car adventure

నటి-వీజే సోఫీ చౌదరి అమెరికాలో చేసిన సాహసం ఇప్పుడు వైరల్ అయింది. మహేష్‌బాబు “1-నేనొక్కడినే” సినిమాలో “లండన్ బాబులు” పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోఫీ, ప్రస్తుతం తన యాక్టివిటీస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా సోఫీ, డ్రైవర్ లేని కార్‌లో శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో ప్రయాణించిన వీడియోను పోస్ట్ చేసింది. అధునాతన టెక్నాలజీతో టెస్లా తయారుచేసిన ఈ కార్, సెట్ చేసిన మార్గాన్ని అనుసరించి ఆటోమేటిక్‌గా ప్రయాణిస్తోంది. కార్ ప్రయాణం కాస్త గుబులు రేపినప్పటికీ సోఫీ ధైర్యంగా సాగిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

డ్రైవర్ లేకుండా కార్‌లో ప్రయాణించడం ఒక సాహసమేనని, ఇది భయానకంగా అనిపించినా, టెక్నాలజీపై నమ్మకం అవసరమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, సోఫీ ఇటీవల హృతిక్ రోషన్ అమెరికా పర్యటనలో సహకరించినందుకు ఆయన నుంచి ప్రత్యేక అభినందనలు అందుకుంది.

సోఫీ చౌదరి పలు హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా, పాతికేళ్ల క్రితం “ఏక్ పరిదేశీ”, “హబీబి” వంటి పాటలతో గాయని గానే గుర్తింపు పొందింది. ఆమె తాజాగా చేసిన ఈ సాహసం ఆమెకి మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ స్థానం తెచ్చిపెట్టింది.

Read More

One thought on “అమెరికా వీధుల్లో టెస్లా కారులో సోఫీ ట్రిప్

Comments are closed.