మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు చత్తీస్ గఢ్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్ల తర్వాత, ఇప్పుడు జార్ఖండ్‌లోనే భారీ ఎన్ కౌంటర్ జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లా, లాల్పానియా ప్రాంతంలోని ‘లుగు’ కొండల్లో ఈ ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ తో కలిసి రాష్ట్ర పోలీసుల అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు.
కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం అందింది. ఘటనాస్థలిలో నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, రైఫిల్స్ వంటి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బలగాలు, వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మావోయిస్టుల ఉనికిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే, మావోయిస్టులందరూ లొంగిపోవాలని లేకపోతే ప్రాణాలతో మిగిలి ఉండరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

One thought on “జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్: ఎనిమిది మావోయిస్టులు హతం”
Comments are closed.