చంద్రుడిపై మానవ చరిత్రలో తొలిసారిగా వేసిన అడుగుల నుండి ఇప్పటికీ మిగిలిన అనేక సమస్యలలో ఒకటి — అక్కడ విసిరేసిన వ్యర్థాల సమస్య. ఈ క్రమంలో, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. చంద్రుడిపై ఉన్న వ్యర్థాలను పునర్వినియోగం చేసేందుకు సరైన పరిష్కారాన్ని కనుగొనేందుకు గాను విశేషమైన ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.
నాసా వివరించిన ప్రకారం, ఇప్పటివరకు చంద్రుడిపై 96 బ్యాగుల వ్యర్థాలను అస్ట్రోనాట్లు వదిలి పెట్టారు. వీటిని సురక్షితంగా, వినియోగయోగ్యంగా మార్చే ఆవిష్కరణకు గాను దాదాపు ₹24 కోట్ల బహుమతిని ప్రకటించింది. చంద్రుడిపై భవిష్యత్తులో స్థిర నివాసాలు ఏర్పరచే దిశగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో, వ్యర్థ నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు ఈ సవాల్‌ను ప్రకటించినట్లు నాసా స్పష్టం చేసింది.
ఇది కేవలం భూగోళపు వ్యర్థాల సమస్యలే కాదు, చంద్రయాత్రల్లో కూడా పర్యావరణ పరిరక్షణకు ముందడుగు కాబోతోందని నాసా ప్రకటించింది. ఈ పోటీ ద్వారా కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చి, అంతరిక్షంలో సుస్థిరతకు మార్గం సుగమం కానుంది.

One thought on “చంద్రుడిపై వదిలిన వ్యర్థాలను పునర్వినియోగం చేసే వారికి నాసా భారీ బహుమతి!”
Comments are closed.