పామ్ సండే వేడుకల్లో ఉన్న ఉక్రెయిన్ ప్రజలపై రష్యా మృత్యుదూతలా విరుచుకుపడింది. సుమీ నగరంలో జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్‌కు ముందు ప్రత్యేకంగా జరుపుకునే పామ్ సండే రోజున ఉదయం 10:15 ప్రాంతంలో ఈ దాడి జరిగింది. నగరంలో ఒకేసారి రెండు క్షిపణులు పేలడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి.
ఈ దాడిలో ఇప్పటివరకు 21 మంది మరణించారని, 34 మందికి గాయాలుయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. “ఈ పవిత్ర రోజున, మా సమాజం నెరవేరనిసిన విషాదాన్ని ఎదుర్కొంది,” అని సుమీ తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కోబ్జార్ తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు. సాధారణ ప్రజలపై దాడి చేయడమే రష్యా మానవత్వానికి ఎంత దూరమైందో చాటిందన్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ దాడి తాత్కాలిక శాంతి ఒప్పందానికి విరుద్ధమని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. “బాలిస్టిక్ క్షిపణులు, వైమానిక బాంబులతో వచ్చే శాంతి లేదు. ఉగ్రవాదానికి అర్హమైన స్థాయిలో రష్యాను చూసే దృక్పథం అవసరం” అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన తాత్కాలిక ఒప్పందం విఫలమైందని స్పష్టమవుతోంది.

One thought on “సుమీపై రష్యా దాడి: చెల్లాచెదురైన మృతదేహాలు”
Comments are closed.