మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విజువల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ “విశ్వంభర”పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్ పెరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ “రామ రామ” విడుదలైంది.
ఎం ఎం కీరవాణి స్వరపరిచిన ఈ భక్తిరసభరిత గీతం, శంకర్ మహాదేవన్ ఆలాపనతో హృదయాలను తాకుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సంగీతప్రియులను మైమరిపించేలా ఉంది. ఒకసారి విన్న వెంటనే మైండ్‌లో మిగిలిపోయేలా ఈ పాట వినిపిస్తోంది.
ఈ పాటలో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ మరింత ఆకట్టుకుంటోంది. భక్తితో నిండిన భావప్రకటన, గ్రాండ్ సెట్స్ మధ్య ఆయన సింపుల్ స్టెప్పులు ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. పాట ద్వారా సినిమా హైప్ మరింత పెరిగింది.
వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు “రామ రామ” పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద “విశ్వంభర” కొత్త రికార్డులు సృష్టించనుందనే విశ్వాసం ఉంది.

One thought on “‘విశ్వంభర’ సినిమా నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ‘రామ రామ’ పాట”
Comments are closed.