పదో తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఇంటర్మీడియట్ విద్యపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “పదో తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి ఎక్కడ, ఏ కోర్సులో చేరాడో స్పష్టంగా ట్రాక్ చేయాలి. పాఠశాల విద్యాశాఖతో సమన్వయం చేసుకుని అన్ని వివరాలు నమోదు చేయాలి” అని సూచించారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరానికి 5,00,965 మంది విద్యార్థులు చేరినట్టు అధికారులు తెలిపారు.
UDISE నమోదు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలన లక్ష్యంగా ఆగస్టు 7వ తేదీ నుంచి ‘అక్షర ఆంధ్ర’ (ప్రాజెక్ట్ అఆ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు అధికారుల వివరించారు. అంతేకాదు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత పొందేందుకు భాషా సబ్జెక్టుల మార్కులను మిగిలిన సబ్జెక్టుల మార్కుల సగటుగా పరిగణించాలని మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో పాఠశాల విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్ష ఎస్‌పీడీ బి. శ్రీనివాసరావు, ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా తదితర అధికారులు పాల్గొన్నారు.
Read More : కమిటీల ఏర్పాటు, అపోహలకు తెరదించనున్న CM

One thought on “ఇంటర్‌లో ప్రతి విద్యార్థి చేరిక తప్పనిసరి – Minister”
Comments are closed.