ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేయడానికి ఉద్దేశించిన యంత్రాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోతే అది విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో నగరంలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ యంత్రాలను అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Read More : 2036 ఒలింపిక్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ?

One thought on “ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మెషీన్లు పంపిణీ.”
Comments are closed.