తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి తొందర లేదని, ఆ బాధ్యత కోసం తానేంటో పరితపించడం లేదని స్పష్టం చేశారు. ‘‘చంద్రబాబు గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి అత్యవసరమైన నాయకుడు. ఈ సమయంలో ఆయన అనుభవం, మార్గదర్శనం రాష్ట్రానికి ఎంతో అవసరం. అలాంటి సమయంలో సీఎం పదవిని నాపై చర్చించడం అసమయోచితం,’’ అని లోకేష్ తెలిపారు.
ఇక తాను పార్టీకి ఇంజిన్ కాదు, పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తలాగే తాను కూడా ఒక భాగమేనని లోకేష్ వినమ్రతతో చెప్పారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరి కృషి అవసరమని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో తన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చేలా ఉండగా, తన తండ్రి చంద్రబాబు నాయకత్వంపై నమ్మకాన్ని మరోసారి వెల్లడించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : మాజీ మంత్రి కొడాలి నానికి విశ్రాంతి అవసరం

One thought on “సీఎం పదవి పై నాకు తొందర లేదు: నారా లోకేష్”
Comments are closed.