తీన్మార్ మల్లన్నపై చర్యలకు NHRC ఆదేశం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)పై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలు జారీ చేసింది.

కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించాయని, అవి మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి, తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని NHRC ఆదేశించింది.

గతంలో కూడా కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో బీఆర్ఎస్ నేతలు, మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో NHRC ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Read More : వెనక్కి తగ్గని మంత్రి కొండా సురేఖ

One thought on “తీన్మార్ మల్లన్నపై చర్యలకు NHRC ఆదేశం

Comments are closed.