కవిత కొత్త పార్టీపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి.?

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె అయిన కవిత రాసిన ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో నూతన మలుపు తీసుకువచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా, తాజాగా మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రఘునందన్ రావు మాట్లాడుతూ, వచ్చే జూన్ 2న కవిత ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. అంతేకాక, ఆమె త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారని వెల్లడించారు. “కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారు. మరి ఇప్పుడు ఆయనే దెయ్యమయ్యారా?” అంటూ శైలిలో ఆయన ప్రశ్నించారు.

ఇంతకాలం తండ్రి కేసీఆర్‌తో కలిసి పదేళ్లపాటు రాజకీయ జీవితాన్ని సాగించిన కవిత, ఇప్పుడు ఆయనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నను రఘునందన్ రావు లేవనెత్తారు. కవితను సమాధానాలకు కోరుతూ… “దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకు?” అని చురకలంటించారు.

అంతేగాక, తండ్రీకూతుళ్ల మధ్య కేసీఆర్ మీడియేటర్లను పంపించారన్న వార్తలపై స్పందించిన రఘునందన్ రావు, “తండ్రీకూతుళ్ల మధ్య మద్యవర్తులు ఎందుకు అవసరం?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారన్న ఊహాగానాలు నిజమవుతాయా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Read More : ఫేక్ ఐఏఎస్ అధికారి లేడీ సరిత అరెస్ట్

One thought on “కవిత కొత్త పార్టీపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి.?

Comments are closed.