అమరావతి: వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శనలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. జగన్ పర్యటనలకు ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోయినా, వైసీపీ సరైన సమాచారం ఇవ్వకపోవడం సమస్యగా మారిందని ఆమె పేర్కొన్నారు. తగిన సమాచారం ఇస్తే ప్రభుత్వం అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు.
జగన్ మహిళల గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తిని పరామర్శించడంపై అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అనుబంధ ఛానెల్ సాక్షిలో పాత వీడియోలను కొత్తవిగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. బంగారుపాళ్యం పర్యటన వీడియోలను నెల్లూరు పర్యటన పేరుతో ప్రసారం చేయడం సరికాదన్నారు.
జగన్ పర్యటనలో తమ కానిస్టేబుల్ చేయి విరిగిందని వెల్లడించిన అనిత, జగన్ పర్యటనలలో ఎప్పుడూ అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజాసేవలో ఉన్న మహిళలపై వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తన తల్లి, చెల్లి గురించి నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్లడాన్ని అనిత పరోక్షంగా విమర్శించారు.
ఈ ఘటనలతో జగన్ పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది.

2 thoughts on “జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం”
Comments are closed.