తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదీ పునరుజ్జీవానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే పూర్తైన పనులపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి, మిగిలిన పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. పనుల్లో ఉన్న అడ్డంకులు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు.
అంతేకాకుండా రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసీ నదికి పునఃజీవం పోసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read More : జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా CDS కేంద్రంలో భట్టి విక్రమార్క నివాళులు

One thought on “మూసీ నది పునరుజ్జీవంపై సీఎం రేవంత్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు”
Comments are closed.