మోడ్రన్ వధువు ఖుషి కపూర్.. స్టన్నింగ్ లుక్ వైరల్!

khushi-kapoor-modern-bridal-look-viral

బాలీవుడ్‌ లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌ సినిమా రంగంలో అడుగుపెట్టారు. జాన్వీ ఇప్పటికే పలు హిట్‌ చిత్రాలతో హీరోయిన్‌గా నిలదొక్కుకోగా, ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె, దక్షిణాదిలోనూ క్రేజ్ పెంచుకుంటోంది.

మరోవైపు ఖుషి కపూర్‌ ‘ది ఆర్చీస్’, ‘లవ్‌ యాపా’, ‘నదానియన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఆమెకు సరైన బ్రేక్‌ ఇంకా రాలేదు. అందమైన ఫోటోషూట్లు, ఫ్యాషన్ స్టేట్మెంట్స్‌తో సోషల్ మీడియాలో హైప్ పెంచుకుంటూ ఉన్నా, కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.

తాజాగా ఖుషి కపూర్‌ మానిఫెస్ట్‌ మ్యాగజైన్‌ కవర్‌పై మోడ్రన్‌ వధువు గెటప్‌లో మెరిసింది. ప్రత్యేకమైన జ్యువెలరీ, ఔట్‌ఫిట్‌కి తోడు ట్రెండీ హెయిర్‌స్టైల్‌ ఆమె లుక్‌కి స్పెషల్‌ టచ్‌ ఇచ్చాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో, అభిమానులు ఆమె స్టైలిష్ హంగ్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి నటనలో శిక్షణ పొందిన ఖుషి, ఇప్పటివరకు చేసిన పాత్రల్లో నటనతో ఆకట్టుకుంది. అయితే, కమర్షియల్ హిట్‌లు రావడం కోసం ఇంకా కొంత సమయం అవసరమవుతుందనే అభిప్రాయం ఉంది. సోషల్ మీడియా ప్రెజెన్స్‌ ద్వారా, తన కవర్ ఫోటోలతోనైనా మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

Read More


One thought on “మోడ్రన్ వధువు ఖుషి కపూర్.. స్టన్నింగ్ లుక్ వైరల్!

Comments are closed.