ఇంటికి వెళ్లాల్సిన వైద్యుడు అదృశ్యమయ్యాడు

ముంబైలో ఓ యువ వైద్యుడి అదృశ్యం కలకలం రేపుతోంది. భోజనానికి ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసిన కొద్ది క్షణాల్లోనే, అతను వంతెనపై నుంచి సముద్రంలో దూకిన ఘటన ఉత్కంఠ కలిగిస్తోంది. జూలై 7వ తేదీ రాత్రి, ముంబైలోని ప్రసిద్ధ జేజే హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఓంకార్ (32), విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. కారులో ప్రయాణిస్తుండగా తల్లికి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నానని తెలిపారు. అయితే రాత్రి 9:40 సమయంలో ముంబై – నవీ ముంబైను కలిపే అటల్ సేతు వంతెనపై కారు ఆపి, ఒక్కసారిగా నీటిలోకి దూకేశారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంతెనపై ఓ కారును గుర్తించారు. అందులో ఓ ఐఫోన్‌ కూడా ఉన్నట్లు కనిపించింది. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆ వ్యక్తి డాక్టర్ ఓంకార్‌గా గుర్తించారు.

ఇప్పటికే రెండు రోజులుగా కోస్ట్ గార్డ్‌, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఓంకార్ ఈ నిర్ణయం తీసుకున్న కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం

One thought on “ఇంటికి వెళ్లాల్సిన వైద్యుడు అదృశ్యమయ్యాడు

Comments are closed.