హైకోర్టులో కొణతం దిలీప్‌కు స్టే ఊరట

డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌కు హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. నిర్మల్ టౌన్, కడెం, ముధోల్, లోకేశ్వరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై నమోదైన ఐదు కేసులపై తదుపరి చర్యలను తక్షణం నిలిపివేయాలని హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దిలీప్ తరఫున సీనియర్ న్యాయవాదులు కె. వివేక్ రెడ్డి, కె. ప్రతీక్ రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఇది వాక్స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. ఇమ్రాన్ ప్రతాప్‌గఢ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఇలాంటి సందర్భాల్లో ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు’’ అని న్యాయవాదులు తెలిపారు. అలాగే అర్నబ్ గోస్వామి కేసును ఉదాహరణగా చూపిస్తూ, ఒకే విషయంపై విభిన్న పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. HCU ఘటనలో “అడవి పోతుంది” అన్న వ్యాఖ్యపై నమోదు చేసిన కేసులో సైతం అది నేరంగా పరిగణించదగినది కాదని హైకోర్టు, సుప్రీంకోర్టుల అభిప్రాయాల ప్రకారం తేలిందని వివరించారు.

ఈ వాదనలు పరిశీలించిన హైకోర్టు, దిలీప్‌పై నమోదైన ఐదు కేసుల్లో తదుపరి దర్యాప్తు చేపట్టకూడదని స్టే విధించింది.

Read More : హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ ముఠా బుగ్గిపడింది

One thought on “హైకోర్టులో కొణతం దిలీప్‌కు స్టే ఊరట

Comments are closed.