అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,050 పెరిగి రూ. 99,450కు చేరుకుంది. 99.9 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారం ధర సోమవారం రూ. 1,000 తగ్గి రూ. 98,400కు పడిపోయింది. అయితే, అక్షయ తృతీయకు ఒక్క రోజు ముందుగా ఈ ధర మళ్లీ పెరిగి పూర్వస్థితికి చేరుకుంది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఏకంగా రూ. 1,100 పెరిగి 10 గ్రాములకు రూ. 99,000కు చేరుకుంది. ఈ ధర ఆ రోజు ముగింపు సమయానికి రూ. 97,900గా నమోదు అయ్యింది.
గతేడాది డిసెంబరులో 10 గ్రాముల బంగారం ధర రూ. 78,950గా ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ. 20,500 (26%) పెరిగింది. ఇదిలా ఉండగా, వెండి ధర కూడా భారీగా పెరిగింది. మంగళవారం, వెండి కిలోకు రూ. 3,500 పెరిగి రూ. 1,02,000 వద్ద నమోదైంది. గత సెషన్‌లో ఈ ధర రూ. 98,500 వద్ద ముగిసింది. మార్చి 19న వెండి ధర కిలోకు వెయ్యి రూపాయలు పెరిగి ఆల్‌టైమ్ హై అయిన రూ. 1,03,500కు చేరుకుని రికార్డు సృష్టించింది.
మార్కెట్ నిపుణులు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు పెరగడం సాధారణ పరిణామమని అభిప్రాయపడుతున్నారు.
Read More : ఒడిశా జైల్లో అరుదైన వివాహం…

One thought on “అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి”
Comments are closed.