అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక కార్యక్రమం నుంచి హుటాహుటిన వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. మాస్కోలో గురువారం జరిగిన ‘స్ట్రాంగ్ ఐడియాస్ ఫర్ ఏ న్యూ టైమ్’ ఫోరమ్‌లో ప్రసంగిస్తున్న సమయంలోనే పుతిన్ అర్ధాంతరంగా ప్రసంగాన్ని నిలిపి, ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాల్సి ఉందని పేర్కొంటూ సభికులకు క్షమాపణలు చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. “నన్ను క్షమించండి, ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాల్సి ఉంది. ఆయనను వేచి ఉండమంటే ఆయనకు కోపం వస్తుంది. అది ఇబ్బందికరం” అని పుతిన్ వ్యాఖ్యానించారు. గతంలో మాత్రం అదే పుతిన్ ట్రంప్‌ను గంటకు పైగా వేచి పెట్టిన విషయం తెలిసిందే. మార్చిలో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్ కాల్ సమయాన్ని పుతిన్ నిర్లక్ష్యంగా తీసుకుని ఆలస్యంగా స్పందించారు. ఇప్పుడు మాత్రం ఆయన వ్యవహారశైలిలో వచ్చిన మార్పు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు నేతల మధ్య ఇది ఆరో ఫోన్ సంభాషణ కావడం గమనార్హం. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ పరిస్థితులు, మధ్యప్రాచ్య పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ చర్చల్లో ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి పురోగతి జరగలేదని ఇరు దేశాలూ వెల్లడించాయి. అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేసిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read MOre : డెల్టా విమానానికి పెను ప్రమాదం తప్పింది

One thought on “నాయకుల సంభాషణపై ఆసక్తికర చర్చలు”
Comments are closed.