మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ యువకుడి ప్రేమ కోసం లింగ మార్పిడి చేసుకున్న మరో యువకుడు, చివరకు మోసపోయాడు. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్వలింగ సంపర్కం నేపథ్యంలో గత పది సంవత్సరాలుగా ఇద్దరు యువకులు స్నేహితులుగా, ప్రేమజీవితాన్ని కొనసాగిస్తూ కలిసి జీవిస్తున్నారు. తమ సంబంధాన్ని పెళ్లివరకూ తీసుకెళ్లాలన్న ఆలోచనతో 25 ఏళ్ల యువకుడు లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని మహిళగా మారాడు. అయితే, లింగ మార్పిడి అనంతరం ఆమెను (మహిళగా మారిన యువకుడు) పెళ్లి చేసుకోవాలని నిరాకరించాడు ప్రియుడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో శారీరకంగా సహజీవనం చేసిన అనంతరం పెళ్లికి నిరాకరించాడని ఆరోపించారు. దీంతో పోలీసులు అతనిపై అత్యాచారం ఆరోపణలతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఈ సంఘటన లింగ మార్పిడి, స్వలింగ సంపర్కం, వ్యక్తిగత హక్కులు, న్యాయ పరిరక్షణ అంశాలపై నూతన చర్చలకు దారితీస్తోంది. పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.
Read More : సీఎం సిద్ధరామయ్యను కలిసిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా

One thought on “లింగ మార్పిడి చేసిన యువకుడిపై మోసం”
Comments are closed.