ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలతో బీసీ సమాజాన్ని అవమానించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మోదీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి కొత్తగా సృష్టించిన పదమే. ఇలాంటి వ్యాఖ్యలకు ఆయనకు గోబెల్స్ బహుమతి ఇవ్వాలి” అని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు ఏమని సమాధానం చెబుతారో చూడాలని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర బీజేపీ కమిటీలో కేవలం 20 పోస్టులే ఉన్నాయని, అందులో ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కావడంతోనే జంబో కమిటీ ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్లుగా తనకు ఎలాంటి రాష్ట్ర స్థాయి పదవి లేదని, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నానని రామచందర్ రావు పేర్కొన్నారు.
Read More : సంచలన ఆరోపణలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి

One thought on “CM పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్”
Comments are closed.