ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఊహించని షాక్ తగిలింది. ఆయనపై నమోదైన సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసులను వేగంగా విచారించాలని కోరుతూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య (Hariram Jogaiah) తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణను శుక్రవారం హైకోర్టు పరిశీలించింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ పురోగతిపై ప్రత్యేక ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా విచారణ చేపట్టింది. హరిరామజోగయ్య దాఖలు చేసిన ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ఈ విచారణలో కలిపింది.
హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఏఏజీ (Additional Advocate General) రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 309కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసులపై విచారణ పురోగతిని తెలియజేయడానికి ఏఏజీ హైకోర్టులో సమయం కోరారు. అయితే, విచారణను వేగంగా పూర్తి చేయాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని హరిరామజోగయ్య తరఫున న్యాయవాది వాదించారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఏఏజీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31వ తేదీ వరకు ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల విచారణ పురోగతిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసులపై మరిన్ని ప్రక్రియల కోసం ప్రత్యేక ధర్మాసనం వచ్చే నాలుగు వారాలపాటు విచారణ చేపట్టనుంది.
Read More : పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు – విడుదలపై ఉత్కంఠ..

One thought on “జగన్‌కు ఊహించని షాక్ – హైకోర్టులో హరిరామజోగయ్య పిటీషన్”
Comments are closed.