మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక మలుపు

మేఘాలయలో సంచలనం రేపిన హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ ఫోన్ కాల్ డేటాలో అత్యధికంగా “సంజయ్ వర్మ” అనే వ్యక్తితో మాట్లాడినట్టు గుర్తించారు. అయితే, అతని అసలు గుర్తింపు గురించి ఆరా తీసిన పోలీసులు ఆ మిస్టరీని ఛేదించారు. సంజయ్ వర్మ పేరు వెనుక ఉన్న వ్యక్తి మరెవరో కాదు, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని వారు స్పష్టం చేశారు.

ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే సోనమ్, రాజ్ మొబైల్ నంబర్‌ను ‘సంజయ్ వర్మ’గా సేవ్ చేసిందని పోలీసులు తెలిపారు. వివాహానికి ముందు, తర్వాత కూడా సోనమ్, రాజ్ కుశ్వాహా కలిసీ 39 రోజుల్లో 234 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం రాజ్ మొబైల్ స్విచ్ఛాఫ్‌లో ఉండగా, హత్యా కుట్రకు మూలకథకుడిగా అతడినే పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసులో సంజయ్ వర్మ పేరు వినడమే ఇదే తొలిసారి అని సోనమ్ సోదరుడు గోవింద్ వెల్లడించారు. రాజా రఘువంశీ హత్యకు సోనమ్ ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇందోర్‌కు చెందిన రాజా, సోనమ్‌ల వివాహం మే 11న జరిగింది. అప్పటికే రాజ్ కుశ్వాహాతో సంబంధం కొనసాగిస్తున్న సోనమ్, పెళ్లి అనంతరం హనీమూన్‌ కోసం రాజాతో కలిసి మేఘాలయ వెళ్లింది. మే 23న నాంగ్రియాట్ గ్రామంలోని హోంస్టే నుంచి బయటకు వెళ్లిన రాజా, సోనమ్ తిరిగి రాకపోవడంతో రాజా మిస్సింగ్ అయ్యాడు. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమవ్వగా, జూన్ 8న సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది. ఇప్పటికే కిరాయి హంతకులు ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మీలను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 11న సోనమ్ తన భర్తను హత్య చేసిన విషయం అంగీకరించింది.

Read More : ఝార్ఖండ్‌లో దారుణం: భర్తను హత్య చేసిన ఇల్లాలు

One thought on “మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక మలుపు

Comments are closed.