అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో భారత్ పర్యటన..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం, వారి విమానం ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఏరియాలో ల్యాండ్ అయింది, అప్పుడు వారికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంలో, అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లలు ప్రత్యేకంగా ఆకర్షించారు.

వారి ఇద్దరు కుమారులు మరియు కూతురు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కుమారులు కుర్తా మరియు పైజామా ధరించి, కూతురు అనార్కలి స్టైల్‌లో ఫుల్ లెంగ్త్ డ్రెస్సులో కనిపించింది. ఈ ప్రత్యేక దుస్తుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

జేడీ వాన్స్ నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇవాళ, ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. వాన్స్ అర్ధాంగి ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ అనే విషయం తెలిసిందే. ఆయన తన కుటుంబంతో కలిసి జైపూర్, ఆగ్రాను సందర్శించనున్నారు. మంగళవారం, జైపూర్‌లోని ప్రసిద్ధ అమెర్ ప్యాలెస్‌ను, బుధవారం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు.

Read More : కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య — కుటుంబ కలహమే కారణమా?

One thought on “అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో భారత్ పర్యటన..

Comments are closed.