అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. ప్రమాద సమయంలో విమానం లండన్‌కు బయలుదేరుతున్న డ్రీమ్‌లైనర్ ఏఐ171గా గుర్తించారు.
ఈ క్రమంలో చంద్రశేఖరన్ మాట్లాడుతూ… “ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు మాటలు రావడం లేదు. టాటా నిర్వహించే సంస్థలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తాం” అని తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై డీజీసీఏ ఇప్పటికే విచారణ ప్రారంభించిందని, బ్లాక్‌బాక్స్, ఇతర డేటా ఆధారంగా సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. ప్రాథమిక నివేదిక వచ్చే వరకు ఊహాగానాలకు తావులేదన్నారు.
ప్రమాదంలో వాడిన విమానం ఇటీవలి కాలంలో పూర్తి తనిఖీలు పూర్తిచేసినదని, ఇంజిన్ల నిర్వహణ 2023 జూన్ మరియు 2025 మార్చిలో జరిగిందని వివరించారు. పైలట్లు కూడా అనుభవజ్ఞులని తెలిపారు. కెప్టెన్‌కు 11,500 గంటలు, కో పైలట్‌కు 3,400 గంటల పైగా విమానయాన అనుభవం ఉందని తెలిపారు.ఈ దుర్ఘటనపై పూర్తి నివేదిక వచ్చే వరకు నిర్దిష్ట కారణాలు తెలియవు కానీ, బాధితుల పట్ల సంస్థ కట్టుబాటుతో స్పందిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
Read More : మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక మలుపు

One thought on “ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై చంద్రశేఖరన్ స్పందన”
Comments are closed.