హార్డ్ డిస్క్‌లో సంచలన నిజాలు బహిర్గతం!

mastan sai

Masthan Sai Case: మస్తాన్ సాయి కన్ఫెషన్‌లో సంచలన విషయాలు వెలుగు

హైదరాబాద్, ఫిబ్రవరి 22: నగ్న వీడియోలు, డ్రగ్స్‌ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి (Masthan Sai) విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మూడురోజుల పాటు జరిగిన ప్రశ్నల్లో పోలీసులు హార్డ్ డిస్క్, డ్రగ్స్, పార్టీల వివరాలపై దృష్టి పెట్టారు. అయితే, డ్రగ్స్‌ గురించి మస్తాన్ సాయి మాట్లాడేందుకు ఇష్టపడకపోవడంతో అధికారులు మరింత విచారణకు సిద్ధమయ్యారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి సరఫరా చేశారు? అనే ప్రశ్నలకు మస్తాన్ సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం.

హార్డ్ డిస్క్‌లో కీలక సమాచారం

మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్‌లో 17 ఫోల్డర్లు గుర్తించగా, పోలీసులు వాటిని ఒక్కొక్కటిగా పరిశీలించారు. మొత్తం 6 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు పోలీసుల నిర్ధారణ. వీటిలో ఎక్కువగా వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్ ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా లావణ్య, మస్తాన్ గర్ల్‌ఫ్రెండ్స్, భార్యకు సంబంధించిన వీడియోలు హార్డ్ డిస్క్‌లో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని సాధారణ వీడియోలు, మరికొన్ని వ్యక్తిగత వీడియోలు కూడా బయటపడ్డాయి.

వాట్సాప్ కాల్ రికార్డింగ్స్, హ్యాకింగ్‌ టూల్స్

మస్తాన్ సాయి దగ్గర 2500కి పైగా ఫోటోలు, 505కి పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయని తెలిపారు. మస్తాన్, లావణ్య ప్రైవేట్ వీడియోలు రహస్యంగా రికార్డ్ చేసినట్లు మస్తాన్ ఒప్పుకున్నాడు. అంతేకాదు, లావణ్య ఫోన్ నుంచి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్‌ను క్విక్ షేర్ ద్వారా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో పోడ్‌కాస్ట్ ఫోల్డర్‌లో ఫోన్ హ్యాకింగ్‌కు ఉపయోగించే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను గుర్తించినట్లు సమాచారం.

Read More