తెలుగు చిత్రపరిశ్రమలో చిరంజీవి అనే పేరు ఒక చరిత్ర. నటనతో పాటు తన ఎనలేని సేవా కార్యక్రమాలతో కూడా ఆయన ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపారు. మెగాస్టార్ స్థాపించిన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అనేక మందికి ఆశాజ్యోతిగా నిలుస్తోంది. సినీ అభిమానులు, ప్రముఖులు ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకుంటూ రక్తదానం చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసి తన మానవతావాదాన్ని చాటుకున్నారు. ఇది ఆయన రెండోసారి రక్తదానం చేయడం విశేషం. చిరంజీవి ఆశయాన్ని గౌరవిస్తూ, ఆత్మీయంగా అనుసరిస్తూ రక్తదానం చేయడం తనకు గౌరవంగా భావిస్తున్నట్టు మణిశర్మ తెలిపారు.
‘‘రక్తదానం చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది. నా సంగీతంతో చిరంజీవిగారి సినిమాలకు సేవలందించిన ఆనందం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు రక్తదానం చేసి మరో విధంగా కూడా ఈ గొప్ప లక్ష్యానికి భాగమయ్యాను. లక్షలాది మంది ఈ సేవా కార్యక్రమంలో ముందుకు వస్తున్నారు. ఆ చైతన్యంలో నేను కూడా ఒక బొట్టులా చేరాను. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన మంచి పని’’ అని మణిశర్మ అన్నారు.
పాటలకు స్వరాలు అందించడమే కాకుండా, మానవత్వానికి నిజమైన అర్థం తెలియజెప్పే వ్యక్తిగా మణిశర్మ నిలిచారు. చిరంజీవి పిలుపు మేరకు రక్తదానం చేసిన ఆయన, మరెందరికో స్ఫూర్తిగా నిలిచారు.

One thought on “చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ”
Comments are closed.