సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శించే వాణిజ్య ప్రకటనలపై చాలా మంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లగ్జరీ మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 300కి పైగా చెల్లించి సినిమా చూసేందుకు వెళ్లినప్పటికీ, ప్రకటించిన సమయానికి సినిమా ప్రదర్శన ప్రారంభం కాకపోవడం విసుగునకు గురి చేస్తోంది.ఇది ప్రేక్షకుల సమయాన్ని వృధా చేయడమే కాకుండా, వారు ముందుగానే ప్లాన్ చేసుకున్న ఇతర కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఈ సమస్యను ఎదుర్కొన్న బెంగళూరుకు చెందిన అభిషేక్ ఎంఆర్, పీవీఆర్-ఐనాక్స్ సంస్థలపై కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. 2023లో బెంగళూరులోని పీవీఆర్-ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లో ‘సామ్ బహదూర్’ సినిమాకు వెళ్లిన ఆయన, సినిమా ప్రారంభానికి ముందే 25 నిమిషాల పాటు ప్రకటనలు ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వల్ల సినిమా ఆలస్యంగా ప్రారంభమై, తాను ప్లాన్ చేసిన సమయానికి కార్యాలయానికి వెళ్లలేకపోయినట్లు కోర్టుకు వివరించారు. విచారణ అనంతరం, కోర్టు పీవీఆర్ సినిమాస్‌పై సంచలన తీర్పు వెలువరించింది.
